'మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది'
మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలలో MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు CM చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.