అనాధాశ్రమంలో బియ్యం, అరటి పండ్లు పంపిణీ

SRPT: మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు నడిగూడెం మండల కేంద్రానికి చెందిన యంగ్‌స్టర్ యూత్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, ఒక ట్రే అరటి పండ్లను ఇవాళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు తంగేళ్ల లింగయ్య మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.