VIDEO: రజకులకు అసెంబ్లీలో 10 స్థానాలు కేటాయించాలని నిరసన

VIDEO: రజకులకు అసెంబ్లీలో 10 స్థానాలు కేటాయించాలని నిరసన

MHBD: కేసముద్రం మండల కేంద్రంలో గురువారం సతీష్ అనే యువకుడు రజకులకు అసెంబ్లీలో 10 స్థానాలు కేటాయించాలని కోరుతూ.. వినూత్న నిరసన తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి, ప్లకార్డును నోటితో పట్టుకొని తన నిరసనను వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ కులానికి ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.