సైన్యం కోసం రష్యా రహస్య వేట

సైన్యం కోసం రష్యా రహస్య వేట

ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయిన రష్యా, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులను సైన్యంలోకి రిక్రూట్ చేస్తోంది. ర్యాజాన్ నగర గవర్నర్ పంపిన రహస్య నోటీసుల ప్రకారం.. కంపెనీలు తమ ఉద్యోగులను సైనిక అభ్యర్థులుగా నామినేట్ చేయాలి. సంస్థ పరిమాణాన్ని బట్టి 2 నుంచి 5 పేర్లను SEP 20లోగా పంపాలని, ఆదేశాలు పాటించని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.