స్వగ్రామానికి చేరుకున్న టెక్ శంకర్ మృతదేహం
SKLM: మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రత దళాలు వారి స్వగ్రామనికి చేర్చాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన టెక్ శంకర్ మృతదేహాన్ని పోలీసులు అతడి స్వగ్రామమైన వజ్రపుకొత్తూరు మండలం బాతుపురానికి చేర్చారు. ఈ క్రమంలో భారీగా ప్రజలు అక్కడికి చేరుకుని మృతదేహానికి ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.