విశాఖలో సందడి చేసిన సంయుక్త మీనన్
విశాఖ, ద్వారకానగర్‌లోని ఓ జువెల్లరి షూరూంను సినీనటి సంయుక్త మీనన్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఫ్రీ లాంచ్ ఈవెంట్‌లో సంయుక్త మీనన్ అభిమానులతో సందడి చేశారు. అఖండ చిత్రం తప్పక అలరిస్తుందని, బాలయ్యతో స్ర్కీన్‌షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు విశాఖలో కూడా అభిమానులు ఉండడం ఆనందంగా ఉందన్నారు.