బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు..!
W.G: 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి భీమవరం పోక్సో కోర్టు జడ్జి బి.లక్ష్మీనారాయణ 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 2021లో జరిగిన ఈ ఘటనపై కాళ్ల పోలీసు స్టేషన్‌లో అప్పట్లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరస్థుడికి కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15 వేల జరిమానా, బాధితురాలుకి రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు.