కల్వకుర్తిలో కుక్కల స్వైర విహారం

కల్వకుర్తిలో కుక్కల స్వైర విహారం

NGKL: కల్వకుర్తి పట్టణంలో ఆదివారం కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ ఘటనలో మొత్తం 18 మంది గాయపడగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తేవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.