ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి

విశాఖలో డాటా సిటీ ఏర్పాటుకు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ముఖ్యులను మంత్రి లోకేష్ కలిసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది. నైపుణ్యం ఉన్న యువతను మరింత ప్రోత్సహించేందుకు డాటా సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సిటీ ఏర్పాటుకు వీలు కల్పించే న్యాయనిబంధనలపై చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి బుధవారం తెలిపారు.