రోడ్డు ప్రమాదం.. ఒకరి కాలు నుజ్జు నుజ్జు

రోడ్డు ప్రమాదం.. ఒకరి కాలు నుజ్జు నుజ్జు

SRPT: సూర్యాపేట మండలం బాలెంల స్టేజ్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుంచి వస్తున్న బైక్‌ను టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగులపాటి అన్నారానికి చెందిన గణేష్ కాలు నుజ్జునుజ్జు కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.