ఐదు నెలల్లో 16,663 అర్జీలు
W.G: భీమవరం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కార ప్రగతిని శాఖల వారీగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల వ్యవధిలో మొత్తం 16,663 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ పరిష్కారాల నాణ్యతపై ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.