కువైట్‌పై విరుచుకుపడిన ఇరాన్

కువైట్‌పై విరుచుకుపడిన ఇరాన్

కువైట్‌పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.