VIDEO: కాళరాత్రి అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు

VIDEO: కాళరాత్రి అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం 9వ రోజు సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. ప్రత్యేక పుష్పాలతో అమ్మవారు శోభాయమానంగా కనువిందు చేశారు.