ఆరోగ్యానికి వ్యాయామం అవసరం: ఎమ్మెల్యే

ఆరోగ్యానికి వ్యాయామం అవసరం: ఎమ్మెల్యే

KDP: ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరిగా అవసరమని ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు. మదనపల్లె పట్టణం, నిమ్మనపల్లె రోడ్డులోని టీవీఎస్ షోరూం వద్ద సోమవారం ఉదయం నూతనంగా ఏర్పాటుచేసిన ఓ జిమ్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ.. ప్రతి మనిషి వ్యాయామాన్ని రోజువారి కార్యక్రమాల్లో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.