సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే
ATP: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు బాధితులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ముఖ్యమంత్రికి అందజేశారు. శింగనమల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.