టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు
CTR: రామకుప్పం మండలం కంచనబల్ల గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బుధవారం వైసీపీ నుంచి టీడీపీలో చేరినట్టు పార్టీ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ఎమ్మెల్సీ శ్రీకాంత్, APSRTC వైస్‌ఛైర్మన్ మునిరత్నం టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు.