నగరంలో నేటి నుంచి యథావిధిగా నీటి సరఫరా

GNTR: గుంటూరులో గురువారం ఉదయం నుంచి తాగునీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని కార్పొరేషన్ ఇంఛార్జ్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఉండవల్లి నుంచి వచ్చే మార్గంలో నులకపేట దగ్గర పడిన గండి, పంపింగ్ కేంద్రాల్లోని అప్కాస్ కార్మికుల సమ్మెతో తాగునీటి సరఫరాలో సమస్య ఏర్పడిందన్నారు. ప్రజల అవసరాల మేరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశామన్నారు.