VIDEO: సాగునీరు అందక కౌలు రైతుల ఇబ్బందులు

కాకినాడ రూరల్ కరపలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు నెర్రలు రావడం, యూరియా దొరకకపోవడం తమను తీవ్రంగా కలచివేసిందని రైతులు వాపోతున్నారు. యూరియా కావాలంటే ఇతర గుళికలు కొనుగోలు చేయాలన్న నిబంధనలు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.