రాఘవేంద్రుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

కర్నూల్: మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకి సేవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు వారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మంచాలమ్మకు పూజలు నిర్వహించారు.