IND vs SA: తొలి టెస్టుకు స్పిన్ పిచ్
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య ఈనెల 14న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం స్పిన్ పిచ్‌ను తయారు చేసినట్లు క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ స్పిన్ పిచ్‌ను తయారు చేయమని తనను అడిగినట్లు ఆయన చెప్పాడు. వారి కోరిక మేరకు స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.