రైతులతో అటవీశాఖ అధికారుల సమావేశం

KMR: మద్నూర్ మండలంలో చిరుత పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు, రైతులు తహశీల్దార్ ఎండీ ముజీబ్ సమక్షంలో తహశీల్దార్ కార్యాలయంలో నేడు సమావేశమయ్యారు. అటవీ శాఖ రేంజ్ అధికారి సంతోష మాట్లాడుతూ.. ఉన్నతాధికారులతో మాట్లాడి చిరుత పులిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు, డ్రోన్ కెమెరాలతో పరిశీలన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.