రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

CTR: పుంగనూరు పట్టణం 33/11kv నక్కబండ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఉమా మహేశ్వర్ రావ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నక్కబండ గ్రామం, బీజీ పల్లె, మర్రిమాకుల పల్లెలో సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన ప్రకటనలో కోరారు.