‘నూతన వ్యవసాయ సాంకేతికత రైతులకు చేరాలి’
SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన 44వ శాస్త్రీయ సలహా సంఘ సమావేశం కెవికె కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలను అందించాలని పలువురు శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, అధికారులు రైతులు పాల్గొన్నారు.