ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

KMR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి తెలిపారు.