చింతమడకలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
సిద్దిపేట రూరల్ మండలం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.