ఎల్లుండి సీఎంలకు మంత్రుల ఆహ్వానం
TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు అన్ని రాష్ట్రాల CMలను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లి CMలను మంత్రులు ఆహ్వానించనున్నారు. జమ్మూకాశ్మీర్, గుజరాత్ CMలను ఉత్తమ్.. పంజాబ్, హరియాణా CMలను దామోదర్ రాజనర్సింహ, AP CMను మంత్రి కోమటిరెడ్డి.. కర్ణాటక, తమిళనాడుకు మంత్రి శ్రీధర్ బాబు, UP CMను మంత్రి పొంగులేటి ఆహ్వానించనున్నారు.