'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

KMM: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎండ్లపల్లి సత్యం అన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలం రేగులచెలకలో మంత్రి తుమ్మల సిఫార్సు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.