చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

SRPT: సూర్యాపేటలోని సాయి సంతోషి జువెలర్స్‌లో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాలిక్ మొల్ల, నేపాల్‌కు చెందిన భట్ట అమర్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 554 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.92,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు దొంగలతో వ్యవహారం ఉండగా విచారణ కొనసాగుతోంది.