ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే రిహార్సల్స్

కృష్ణా: 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. వేడుకలలో భాగంగా శుక్రవారం ఉదయం మంచు కురుస్తున్న వేళ కవాతు బృందాలు నేపథ్య సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. కాగా, స్టేడియంలో ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్న పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి.