దాని కోసం వేచి చూస్తున్నా: మోదీ
జీ20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకోవటంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'జీ20 సమావేశం కోసం జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నాను. కీలక అంశాలపై ప్రపంచాధినేతలతో చర్చించేందుకు వేచి చూస్తున్నా. వివిధ దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, తద్వారా యావత్ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యం' అని తెలిపారు.