సర్వాంగ సుందరంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు

సర్వాంగ సుందరంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు

HYD: వరలక్ష్మి వ్రతం సందర్భంగా చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయాన్ని పూలమాలలు, రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.