స్కూటీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి గాయాలు

స్కూటీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి గాయాలు

KMM: సత్తుపల్లి మండలం రేగళ్లపాడు శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అన్నపురెడ్డిపల్లికి చెందిన మార్కపురి లోకేష్, ఇలాసారపు పవన్ స్కూటీపై సత్తుపల్లి వస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. 108 సిబ్బంది లోకేష్, పవన్‌ను మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.