'గత వైభవం' ట్రైలర్ రిలీజ్
దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం 'గత వైభవం'. ఈ కన్నడ చిత్రం తెలుగులోనూ ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విభిన్న ప్రేమకథతో ఈ సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.