తిరుమలలో TTD బోర్డు సభ్యురాలి తనిఖీలు

తిరుమలలో TTD బోర్డు సభ్యురాలి తనిఖీలు

తిరుమల షాపింగ్ కాంప్లెక్స్‌లో TTD బోర్డు సభ్యురాలు అనుగోలు రంగశ్రీ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపులు లైసెన్స్‌లతో నడుస్తున్నాయా? ఏవైనా అక్రమ తట్టాలు నిర్వహిస్తున్నారా? అనే విషయాలను ఆరా తీశారు. అవసరమైన చోట్ల పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.