BREAKING: యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
యుద్ధం నాలుగు వారాల పాటు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అప్పటి వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ముగ్గురు అమెరికా సైనికుల మృతికి తాము ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. యుద్ధం ముగిసేలోపు మరింత మంది అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ పాలన బదిలీపై తమకు భారీ వ్యూహాం ఉందని పేర్కొన్నారు.