VIDEO: కోనసీమలో వర్షాలు.. ఆందోళనలో రైతన్నలు

VIDEO: కోనసీమలో వర్షాలు.. ఆందోళనలో రైతన్నలు

కోనసీమ: తుఫాన్ ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో, వరి కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని బరకాలతో కప్పి ఉంచారు. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోయినా, అనుకోకుండా భారీ వర్షం కురిస్తే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.