ఇంట్లోకి చొరబడిన శ్వేత నాగు
BHPL: గణపురం మండలం పరశురాంపల్లి గ్రామంలో శ్వేత నాగు కలకలం రేపింది. సోమవారం శ్రీరాముల సాంబయ్య అనే వ్యక్తి ఇంటిలోకి చొరబడిన శ్వేతనాగు ఇంటి ఆవరణలోకి వచ్చి ఇంటివారిని బెంబేలెత్తించింది. శ్వేత నాగు ఇంటి పరిసరాలలో రావడంతో పామును చూసి వారు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్యాచార్ రహీం పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు.