'రాజీవ్ వికాస్ దరఖాస్తు తేదీని పొడిగించాలి'

SRPT: బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం రాజీవ్ యువ వికాస్. ఈ పథకానికి దరఖాస్తు గడువు పొడగించాలని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం సెలవు దినం కావడంతో సైట్ ఓపెన్ కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతారు అని అన్నారు.