రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
VZM: డెంకాడ మండలం గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీ శంకర్ తెలిపారు. ఈ నెల 16న ఎల్.కోటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. హెచ్ఎం అరుణ విద్యార్థులను అభినందించారు.