VIDEO: గంటకు పైగా క్యూలైన్‌లో ఓటర్లు
RR: కడ్తాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద గంటకు పైగా బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు. రంగారెడ్డి జిల్లాలో భాగమైన ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగుతోంది.