వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన మంత్రి
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించే వారికి రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి మొదటి గంటలోపు 'పీఎం రాహత్' పథకం కింద రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్య ఖర్చు అంతకు మించితే, మిగిలిన మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ కింద భరిస్తామని ఆయన పేర్కొన్నారు.