నిజాంసాగర్ కాలువలో మృతదేహం

నిజాంసాగర్ కాలువలో మృతదేహం

NZB: చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.