సింగరాయకొండలో గ్రామసభ
ప్రకాశం: సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సమయంలో గ్రామంలోని కీలక సమస్యలపై ప్రజలు, నాయకులు గళమెత్తారు. ఎండలు ముదురుతున్న వేళ తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను కోరారు. మురుగునీటి కాలువల నిర్వహణ, పారిశుద్ధ్యం మెరుగుదల, పంచాయతీ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.