VIDEO: కార్పెంటర్‌కు తప్పిన ప్రమాదం
అన్నమయ్య: మదనపల్లె మండలం బుగ్గకాలువలో డిజైన్ కత్తిరించే సమయంలో జరిగిన ప్రమాదంలో చోటు (34) అనే కార్పెంటర్ శుక్రవారం తీవ్రంగా గాయపడ్డాడు. పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కట్టర్ అతని కడుపుపై పడడంతో కడుపు చీలిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని సహచరులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.