పాఠశాలల ఖాతాలో రూ. 47.54 లక్షలు జమ
CTR: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఈనెల ఐదున మెగా పీటీఎం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీడి వెంకటరమణ తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 900 నుంచి రూ. 9 వేల వరకు 2460 పాఠశాలలకు రూ. 47.54 లక్షలను పాఠశాలల ఖాతాలో జమ చేశామని తెలిపారు.