వ్యక్తిపై హత్యాయత్నం.. నిందితుడిని రిమాండ్

వ్యక్తిపై హత్యాయత్నం.. నిందితుడిని రిమాండ్

KMM: ఓ వ్యక్తిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ ఇన్‌స్పెక్టర్ మధుబాబు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ కథనం ప్రకారం.. ఖమ్మం రామ్ నగర్‌కు చెందిన అంజయ్యపై కొన్ని రోజుల క్రితం తన్నీరు శ్రీను కత్తితో దాడి చేశాడు. చికిత్స అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.