VIDEO: 5ఏళ్ల బాలుడి పై వీధికుక్కల దాడి

5ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై మూడు కుక్కలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని నిలువరించింది. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో డాగ్ లవర్స్‌కు ఇలాంటి ఘటనలు కనిపించట్లేదా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.