సరైన పత్రాలు లేని ఆరు బైకులు స్వాధీనం: సీఐ
VSP: భీమిలి స్టేషన్ పరిధిలో పోలీసులు సోమవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఆరు బైక్‌లను సీజ్ చేశారు. భీమిలి, తగరపువలస ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. అలాగే తగరపువలస ప్రాంతంలో గొలుసు మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు.