రేణిగుంట నూతన ఎస్సైగా ధర్మారెడ్డి
TPT: రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ధర్మారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వడమాలపేట ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై రేణిగుంటకు చేరుకుని పదవిలోకి వచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటానని ధర్మారెడ్డి తెలిపారు.