‘కాలం కలిసొస్తే గ్రామ సింహాలు కూడా మొరుగుతాయి’
TG: కాలం మారినప్పుడు, మోసం గెలిచినప్పుడు గ్రామ సింహాలు కూడా మొరుగుతాయంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాజీమంత్రి KTR ఎద్దేవా చేశారు. వానపాములు నాగుపాముల్లా బుసలు కొడుతున్నాయని, జీవితంలో 'జై తెలంగాణ' అననోళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 420 హామీలు, 6 గ్యారంటీలతో జనాన్ని మోసం చేసిన వాళ్లకు భయపడేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.